కౌలాలంపూర్, ఫిబ్రవరి 14: మలేషియాకు చెందిన ఓ వ్యాపారి చాలా ఏండ్ల క్రితం రూ.300తో కొన్న వెబ్‌సైట్‌ను ఇప్పుడు రూ.634కోట్లకు అమ్మేశాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెబ్సైట్ డీల్‌గా ఇది నిలిచింది. 1993లో అశ్రయాన్ ఇస్మాయిలీ అనే వ్యక్తి ‘ఏఐ.డాట్‌కామ్’ అనే డొమైన్‌తో వెబ్‌సైట్‌ను కొనుగోలు చేశాడు. ఇంటర్నెట్లో ఏఐ.డాట్‌కామ్ అన్న పేరు చాలా పాపులర్ అడ్రస్‌గా మారింది. ఈ వెబ్‌సైట్‌ను క్రిప్టో డాట్‌కామ్ సీఈవో క్రిస్ మార్స్జాలెక్ 2025లో పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి కొనుగోలు చేశారు.