వాషింగ్టన్: ప్రేమికుల రోజును పురస్కరించుకుని అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం కొన్ని డిజిటల్ కార్డులను విడుదల చేసింది. ట్రంప్ రాజకీయ నిర్ణయాలకు సంబంధించిన విషయాలు, చిత్రాలను ఇందులో పొందుపరిచింది. ‘మీరు ( వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో) నా హృదయాన్ని స్వాధీనం చేసుకున్నారు’, ‘యూ ఆర్ మై వాలంటైన్’, మీపై నాకున్న ప్రేమ అక్రమ వలసదారుల పట్ల డెమొక్రాట్ల ప్రేమలా బలంగా ఉంటుంది’, ‘పరిస్థితిని నిర్వచించే సమయం ఇదే’ అని వివిధ సందర్భాలకు తగ్గట్టు వ్యాఖ్యలు ఉన్నాయి.