నార్కట్పల్లి, మార్చి 13: మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఔరవాణిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో అన్ని వార్డుల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మండలంలోని బాజకుంట గ్రామంలో జడ్పీ నిధుల నుంచి రూ.లక్ష 30 వేలతో విద్యుత్ స్తంభాలు, వైర్లతో విద్యుత్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని పార్వతీ రామలింగేశ్వరస్వామి కల్యాణంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, యానాల అశోక్ రెడ్డి, ఎంటీసీలు రాజిరెడ్డి, యాదయ్య, జయలక్ష్మి, సర్పంచ్ యాదగిరీఆండాలు పాల్గొన్నారు.
వంతెన పనులకు శంకుస్థాపన
కట్టంగూర్: మండలంలోని దుగినివెల్లి గ్రామంలో పెద్దవాగుపై రూ. 20 లక్షలతో వంతెన, రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, కల్మెరలో రూ.5 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బలరాములు పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలోసర్పంచులు వనం సైదమ్మాదుర్గయ్య, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, వడ్డె సైదిరెడ్డి, గుర్రం సైదులు, ఎంపీటీసీలు మల్లెబోయిన శ్రీలతాకృష్ణ, పాలడుగు హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ చైర్మన్ కుందారపు వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊ ట్కూరి ఏడుకొండలు, నాయకులు బీరెల్లి ప్రసాద్, పోతరాజు నగేశ్, గాదగోని రామలింగయ్య పాల్గొన్నారు.