ఎమ్మెల్యే చిరుమర్తికి నిధుల జీఓ కాపీ అందజేసిన మంత్రి కేటీఆర్
కట్టంగూర్(నకిరేకల్), మార్చి 12 : నకిరేకల్ పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 27.75 కోట్లు మంజూరు చేసింది. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన జీఓ కాపీని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే చిరుమర్తికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిధుల మంజూరు వివరాలను వెల్లడించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ నిర్మాణానికి రూ.26 కోట్లు, కాలంవారికుంట మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి రూ.75 లక్షలు, ఎస్సీల వైకుంఠధామ నిర్మాణాలకు రూ.50 లక్షలు, క్రిస్టియన్ వైకుంఠధామ నిర్మాణాలకు రూ.50 లక్షలు మంజురైనట్లు వివరించారు. నకిరేకల్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. సిద్దిపేట తరహాలో నకిరేకల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, నియోకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.