తుంగతుర్తి, మార్చి 9 : మండల కేంద్రంలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా సీవీటీ పేలడంతో పెద్దఎత్తున మంటలు ఎగసి పొగలు వ్యాపించాయి. వడ్డె కొత్తపల్లి ద్వారా హై ఓల్టేజీ కరెంట్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా సమాచారం. సీవీటీలో పేలడంతో దానిలో ఉన్న రూ.కోటి విలువైన పీటీఆర్-2కు తగలడంతో దాని నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. ప్రమాద సమయంలో సబ్‌స్టేషన్‌లో ముగ్గురు ఆపరేటర్లు ఉన్నప్పటికీ ఎవరికి ఏమీ కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఎస్ఐ ఆంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు కారణంగా సబ్‌స్టేషన్‌కు భారీ నష్టం వాటిల్లిందని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.