నీలగిరి, మార్చి 9 : నల్లగొండ పట్టణ ప్రజలకు ఆహ్లాదం కోపం కాలనీల్లోని మున్సిపల్ స్థలాల్లో పార్కులు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి అన్నారు. వార్డు వాచ్‌లో భాగంగా బుధవారం 31,33 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్-2 పథకం భాగం గా పట్టణ జనాభాకు అనుగుణంగా పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు ఈ నెలాఖరులోగా చెల్లించాలన్నారు.అంతకుముందు అవార్డు పరిధిలోని సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పరిశీలించి బీసీ హస్టల్‌ను తనిఖీ చేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు ఖయ్యూంబేగ్, రావిరాల పూజితావెంకటేశ్వర్లు, టీపీఓ నాగిరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్ట్టర్లు సురిగి శంకర్, గడ్డం శ్రీనివాస్, కాలనీవాసులు పాదూరి ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.