వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ లలితాదేవీఆనంద్
బొడ్రాయిబజార్, మార్చి 9 : రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అభివృద్ధికి బాటలు వేస్తుందని మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీఆనంద్ అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండీ ఫసియోద్దీన్ మార్కెట్ చైర్‌పర్సన్‌ను, మహిళా డైరెక్టర్లను సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, డైరెక్టర్లు దాచేపల్లి భరత్, సల్మా మస్తాన్, ఉట్కూరి సైదులు, సంకరమద్ది రమణారెడ్డి, బానోతు గంగరాజు, బోనాల రవీందర్, ముప్పారపు నాగేశ్వర్రావు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
కిడ్నీ ఇచ్చి కొడుకు ప్రాణాలు కాపాడిన తల్లికి సన్మానం
కిడ్నీ మార్పిడి చేస్తేనే ప్రాణాలు దక్కుతాయని సూచించిన వైద్యుల సలహా మేరకు తన కిడ్నీని ఇచ్చి కొడుకు ప్రాణాలు కాపాడిన మాతృమూర్తి నెమ్మాది విజయలక్ష్మి అని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవింద్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆమెను శాలువా, మెమోంటోతో సత్కరించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కిరాణ ఫ్యాన్సీ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జే.నర్సింహారావు, చెరుకు సత్యం, వీరబోయిన రవి, మామిడి సుందరయ్య పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సూర్యాపేట అర్బన్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు జ్యోతి, మెప్మా టౌన్ అధ్యక్షురాలు వెన్న కవిత అన్నారు. బాల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో బాల కేంద్రం సూరింటెండెంట్ బండి రాధాకృష్ణరెడ్డి, సఖీ కేంద్రం కౌన్సిలర్ చైతన్య, మహిళా హక్కుల సంఘం టౌన్ చైర్మన్ విజయలక్ష్మి, సభ్యులు సైదమ్మ, శైలజ, శారద, లక్ష్మి, అరుణ, సుశీల పాల్గొన్నారు.