బొమ్మలరామారం : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతంరం వారిని సన్మానించారు. నాగినేనిపల్లిలో సర్పంచ్ బీరప్ప అధ్వర్యంలో మహిళా పంచాయతీ కార్మికులు, ఆశ కార్యకర్తలు, అంగన్ వాడీలను సత్కరించారు. తాసీల్దార్ పద్మసుందరి, ఎంపీడీఓ సరిత, ఏఓ దీప్తి, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం మండల వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. పెద్దకందుకూరు, రామాజీపేటలో ఉపాధి హామీ కూలీలు పని చేసే ప్రదేశాలకు వెళ్లి వేడుకలు నిర్వహించారు. కూలీలతో కేక్ కట్ చేయించి వారిని ఘనంగా సన్మానించారు. ఎంపీపీ చీర శ్రీశైలం, సర్పంచ్ భీమగాని రాములుగౌడ్, ఎంపీడీఓ కారం ప్రభాకర్‌రెడ్డి, ఏపీఓ నారాయణ, యాత్ర ఎన్జీఓ కార్యదర్శి సురిపంగ శివలింగం, పంచాయతీ కార్యదర్శి జమ్లా నాయక్ పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండలంలోని వీరారెడ్డిపల్లిలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సర్పంచ్ జక్కుల శ్రీవాణి, ఎంపీటీసీ శ్రీనివాస్‌యాదవ్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్, మహిళలు పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులను పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత ఘనంగా సన్మానించారు. పంచాయతీ కార్యదర్శి ప్రమీల, వార్డు సభ్యులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తాసీల్దార్ జ్యోతి, సర్పంచ్ శ్రీలత, ఏఈఓ శివానిని సన్మానించారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి రాములు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, చిరంజీవి పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఆత్మకూరు(ఎం) : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎంపీపీ తండామంగమ్మ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా ప్రజా ప్రతినిధులను, అధికారులు వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లను సన్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బందిని సర్పంచ్ జెన్నాయికోడె నగేశ్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ భారతితోపాటు ఇతర ఉద్యోగులను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించగా రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ బీసు ధనలక్ష్మి మహిళలతో కలిసి కేక్‌కట్ చేశారు. బ్రిలియంట్ పాఠశాలలో మహిళా ఉద్యోగులకు క్రీడలు నిర్వహించి బహుమతులు అందజేశారు. జడ్పీటీసీ నరేందర్‌గుప్తా, ఎంపీడీఓ ఆవుల రాములు, వైస్ ఎంపీపీ బాషబోయిన పద్మ, మాజీ ఎంపీపీ హేమలత, ఎంపీటీసీ అంశమ్మ, రాజాలుబాయి పాల్గొన్నారు.
గుండాల : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించిన సుద్దాల ఆశ కార్యకర్త శోభారాణిని కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా కేంద్రంలో సత్కరించారు.
ఆలేరు రూరల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పుగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి ఇందిరను జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి సన్మానించారు.
యాదాద్రి : యాదగిరిగుట్ట పట్టణంలోని పద్మశాలీ సత్రంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు దీకొండ వెంకటేశ్ సహకారంతో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మందికి చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, ప్రధాన కార్యదర్శి సుజాత, కోశాధికారి ఉమ, ప్రధాన కార్యదర్శి బాలయ్య పాల్గొన్నారు.