మర్రిగూడ, మార్చి 8: దళితబంధు పథకానికి బడ్జెట్ సమావేశాల్లో భారీగా నిధులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దళితబంధు జిల్లా కమిటీ సభ్యుడు లపంగి నర్సింహ ఆధ్వర్యంలో మంగళవారం మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్, ఉపాధ్యక్షుడు పందుల పాండు, నాయకులు ఎడ్ల శ్రీరాములు, వర్కాల వెంకటేశ్, పందుల కృష్ణ, పల్లె యాదగిరి, జిల్లా కృష్ణ, భీమనపల్లి రాములు పాల్గొన్నారు.
నేరేడుచర్ల/ గరిడేపల్లి/ మఠంపల్లి: బడ్జెట్లో దళి త బంధు కోసం రూ.17,700 కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి మండలకేంద్రాల్లో సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
నేరేడుచర్లలో ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ నర్సయ్య, మున్సిపల్ చైర్మన్ జయబాబు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ అప్పిరెడ్డి, ఉపాధ్యక్షుడు వస్కుల సుదర్శన్, చిట్యాల శ్రీను, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ అనంతు శ్రీనివాస్, కల్లూరు సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, గరిడేపల్లిలో సర్పంచులు నకిరేకంటి ప్రసాద్, కాశయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణానాయక్ పార్టీ మండల పరిశీలకుడు పిడమర్తి రాజు, కడప ఇసాక్, రాం సైదులు మఠంపల్లిలో సర్పంచ్ మర్నెం శ్రీనివాస్‌రెడ్డి, దళిత నాయకులు కందుల పెద్దమోశ, ఎర్రమల్ల పెద్దకాశి, పోతబత్తిని శ్రీనివాస్, చిన్న శ్రీనివాస్ పాల్గొన్నారు.