నార్కట్‌పల్లి/నీలగిరి/కట్టంగూర్,మార్చి 8: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నల్లగొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో మంగళవారం నిర్వహించారు. నార్కట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండలో ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. నార్కట్‌పల్లి శబరి గార్డెన్లో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న సిబ్బందిని శాలువాతో సన్మా నించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 46 మంది లబ్ధ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు, పాల్గొన్నారు.
కట్టంగూర్‌లో నిర్వహించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేక్ కట్ చేసి అధికారులు, ప్రజాప్రతినిధులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, ఏపీఎం చౌగోని వినోద, గుర్రం సైదులు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊ ట్కూరి ఏడుకొండలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.నకిరేకల్‌లో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, ఉమారాణి,మురారిశెట్టి ఉమారాణి, టీ ఆర్ఎస్ మండల, పట్టణధ్యక్షులు నవీన్‌రావు, సైదిరెడ్డి పాల్గొన్నారు.
నల్లగొండ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలు అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. అనంతరం ఇటీవల కేటీఆర్ హామీతో ఏఎన్ఎంగా ఉద్యోగం పొంది న కర్మిషాను సన్మానించారు. అంగన్వాడీ టీచర్లకు చీరెలు అందజేసి 22 మంది దివ్యాంగులకు మోటార్ సైకిళ్లను అందజేశారు. స్వర్ణకంచి ఆధ్వర్యంలో ప్రత్యేక గిఫ్ట్‌ప్యాక్‌లను అందజేశారు. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఐసీడీఎస్ ఆర్ఓ మాలె శరణ్యరెడ్డి, పీడీ సుభద్ర, సీడీపీఓ తూముల నిర్మల, ఎంపీపీ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రసుధాకర్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, కౌన్సిలర్లు యామ కవితాదయాకర్, పర్వత్ ఫర్జానా ఇబ్రహీం, అభిమన్యుశ్రీనివాస్ ఉన్నారు.
టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో…
టీఎన్జీఓస్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మహిళా ఉద్యోగులు, కౌన్సిలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొండల్రావు, ఐసీడీఎస్ పీడీ సుభద్ర, తూముల నిర్మల టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రావణ్‌కుమార్, చేపూరి నర్సింహాచారి, అకునూరి లక్ష్మయ్య, వెంకటయ్య, బేజాల శేఖర్‌రెడ్డి, జిల్లా రాజమల్లయ్య, ఎల్లంపల్లి రాజయ్య, రేణుక, సోమేశ్వరి, వెంకట నర్సమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత, గుత్తా రజిత, పుట్ట సునీత, మజ్జిగపు సునీత పాల్గొన్నారు. 33వ వార్డులో పారిశుధ్య కార్మికులకు టీఆర్ఎస్ యువజన నాయకుడు రేగట్టె లింగస్వామిగౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈసందర్భంగా మహిళలకు చీరెలు అందజేసి శాలువాతో సన్మానం చేశారు.కార్యక్రమంలో బీసీ వార్డెన్ భీమగాని రణదివే, వసంత, బెల్లి సత్తమ్మ, మహేశ్వరి, జ్యోతి, శిల్ప, కావ్య, అలుగుబెల్లి సైదిరెడ్డి, సురేశ్, మెహన్, సందీప్ ఉన్నారు.
మహిళలు చైతన్యం కావాలి: ఎమ్మెల్సీ
నీలగిరి : మహిళలు మారుతున్న కాలనుగుణంగా సోషల్ మీడియ వేదికలపై చైతన్యవంతులు కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిలోనే లింగ సమానత్వం గురించి పిల్లలకు నేర్పించాలన్నారు. అంతకుముందు ఉత్తమ ప్రతిభ కనబర్చిన అంగన్వాడీ సిబ్బందికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో పీడీ సుభద్ర, డీఆర్డీఓ కాళిందిని, హౌసి ంగ్ పీడీ రాజ్‌కుమార్, జడ్పీ స్థాయీ సంఘం చైర్మన్ స్వరూప రాణి పాల్గొన్నారు.
తిప్పర్తి : వెంకటాద్రిపాలెంలోఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో చొక్కారావు, రామారావు, దామోదర్‌రావు, చంద్రకళ, నీరజ, విజయలక్ష్మి పాల్గొన్నారు.
కనగల్ : మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, సిబ్బందిని సన్మానించారు. అనంతరం చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓ ముజవుద్దీన్, ఏపీఓ సుధాకర్ వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్‌రావు, పీఎసీఎస్ చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, నాయకులు కడారి కృష్ణయ్య, పులకరం వెంకన్న, యేరేడ్ల సుధాకర్‌రెడ్డి, ఎర్రబెల్లి నర్సిరెడ్డి కార్యదర్శుల సుంకిరెడ్డి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్‌లో..
చిట్యాల: మండలంలోని ఆరెగూడెం, గుండ్రాపల్లి గ్రామాల్లో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్ సర్పంచ్‌లు ఆరూరి లాలమ్మాస్వామి, రత్నం పుష్పానర్సింహ, మేడి లింగమ్మ, మమత, బోయపల్లి శ్రీవాణీశ్రీనివాస్, మర్రి జలంధర్‌రెడ్డి, కక్కిరేణి బొందయ్య, ఎంపీటీసీలు నీతారమణారెడ్డి, దుబ్బ పద్మ, అంజమ్మ పాల్గొన్నారు.
కేతేపల్లి : మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పూలమాల, శాలువా వేసి ఘనంగా సన్మానించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచులు బి.శ్రీనివాస్‌యాదవ్, బచ్చు జానకీరాములు,
శాలిగౌరారం: మోత్కూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ దంపతులు మండలంలోని అధికారులను, ప్రజాప్రతినిధులను తుంగతుర్తి ఘనంగా సన్మానించారు.
మునుగోడులో..
చండూరు : సీఎం కేసీఆర్ సమక్షంలో రాష్ట్రంలోని మహిళలకు గౌరవం దక్కుతుందని మును గోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక భవానీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళాదినోత్సవంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి, కటౌట్‌కు మహిళా ఉద్యోగులు రాఖీ కట్టారు. అనంతరం మహిళా ఉద్యోగులకు కూసుకుంట్ల చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, పాశం సురేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, నాంపల్లి ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతారవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుర్రం మాధవీవెంకట్ రెడ్డి, కోడిసుష్మ, పెండ్యాల గీతా, సంగేపు సువర్ణ, కౌన్సిలర్లు చిలూకూరి రాధికాశ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు.
మునుగోడు : పులిపలుపులలో ఎస్ఐ సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సివిల్ సర్వీ స్ శిక్షణాధికారులు అమిత్ రంజన్, రాజత్ చతుర్వేది, అభిమన్యు, దీపక్‌శర్మ, దీపక్ మండివాల్, ఎంపీఓ సుమలత, సీఐ అశోక్‌రెడ్డి, సర్పంచ్ పందుల మారయ్య, ఎంపీటీసీ బొల్గూరి లింగయ్య పాల్గొన్నారు. శ్రవణ్‌కుమార్, కొండా సరిత, గోలి మంజుల, కోట వెంకటేశ్వరరావు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
నాంపల్లి : మండల కేంద్రంలోని ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, మహిళ ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషు కుమార్, ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, సర్పంచ్ పోగుల దివ్య పాల్గొన్నారు.
మర్రిగూడ :కస్తూర్బాగాంధీ విద్యాలయం, తాసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్ల్లో మహిళా ఉద్యోగులను శాలువాలతో సన్మానించారు. తాసీల్దార్ పుష్పలత, ఎస్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, ఎంఈఓ గురువారావు, పద్మాగౌడ్ పాల్గొన్నారు.