మిర్యాలగూడ, మార్చి 8 : మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణంలోని ఎస్వీ గార్డెన్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గం పరిధిలోని మహిళా అధికారులు, ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం 284 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యులు, పారిశుధ్యకార్మికులు చేసిన సేవలు మరువలేనివన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు పింఛన్లు, ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి వంటి పథకాలతో చేయూతనిచ్చిన గొప్ప సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రూ. 2 లక్షల కోట్లు సంక్షేమ రంగానికి కేటాయించిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు.
మహిళా పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే భాస్కర్‌రావు
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. అధిక నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. పుట్టిన బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరికీ లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఆర్డీఓ రోహిత్‌సింగ్, తాసీల్దార్ గణేశ్, ఏడీఏ పోరెడ్డి నాగమణి, ఎంపీపీలు నూకల సరళ, నందిని, శ్రీవిద్య, సునీత, జడ్పీటీసీలు ఇరుగు మంగమ్మ, లలిత, మైనార్టీ నాయకురాలు షహనాజ్‌బేగం పాల్గొన్నారు.
మహిళలకు ప్రాధాన్యం ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండ : సీఎం కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తుండడంతో వారు ముందున్నారని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండలో నిర్వహించిన మహిళా బంధు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు బస్టాండ్ నుంచి శివసాయి గార్డెన్ వరకు సుమారు 3వేల మంది మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్, మాధవరం సునీతాజనార్దన్రావు, బానావత్ పద్మ, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, కంకణాల ప్రవీణావెంకట్‌రెడ్డి, కేతావత్ బాలూనాయక్, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్ చైర్పర్సన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, కంకణాల వెంకట్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు టీవీఎన్‌రెడ్డి, రమావత్ దస్రూనాయక్, లోకసాని తిరుపతయ్య, ముత్యాల సరయ్య, దొంతం చంద్రం శేఖర్‌రెడ్డి, వల్లపు రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, ఉజ్జిని సాగర్‌రావు, రాజినేని వెంకటేశ్వర్రావు, కేసాని లింగారెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, మారుపాకుల సురేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, సర్పంచులు కుంభం శ్రీనివాస్‌గౌడ్, శ్రీనునాయక్, మల్లారెడ్డి, మునుకుంట్ల వెంకట్‌రెడ్డి, యుగేంధర్‌రెడ్డి, అనితారెడ్డి, సుమతీరెడ్డి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సంక్షేమంలో నంబర్ వన్ ఎమ్మెల్యే నోముల భగత్
హాలియా : మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. అంతర్జాయతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మంగళవారం హాలియా లక్ష్మీనర్సింహగార్డెన్లో నిర్వహించిన మహిళా బంధు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 185 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. అనంతనం మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ ఇరిగినేని అంజయ్య, హాలియా మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మా శంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, టీఆర్ఎస్ నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, మర్ల చంద్రారెడ్డి, రాంచంద్రయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామర్ల జానయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, నరేందర్, తాటిసత్యపాల్, రవినాయక్, పిడిగం నాగయ్య, షేక్ అబ్బాస్, ఎన్నమల్ల సత్యం, పోశం శ్రీనివాస్‌గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.