చిట్యాల, ఫిబ్రవరి 28 : గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని వట్టిమర్తి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ మెండె సైదులు, నాయకులు ఎల్ల సత్యనారాయణరెడ్డి, కృష్ణ, రాజు, శ్రీకాంత్, భిక్షంరెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మేజర్ గ్రామపంచాయతీ వార్డుల్లో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం కాలినడకన పర్యటించారు. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యతను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బీసీ హాస్టల్‌ను సందర్శించి భోజన స్థితిగతులపై ఆరాతీశారు. 12 వార్డుకు చెందిన కుంభం వసుమతి తన భర్త కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడని ఎమ్మెల్యేకు తెలుపగా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. భక్తులకు సకల మౌళిక వసతులు కల్పించాలని ఆయల చైర్మన్ మేకల అరుణా రాజిరెడ్డి, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, పట్టణాధ్యక్షులు దోసపాటి విష్ణుమూర్తి, గోదల వెంకట్ రెడ్డి, రాధారపు భిక్షపతి, దేవేందర్, శ్రీను, ప్రభాకర్ పాల్గొన్నారు.