మిర్యాలగూడ, ఫిబ్రవరి 26 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ‘మన ఊరు.. మన బడి కార్యక్రమంపై ఏఎంసీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు అందని ద్రాక్షలా ఉన్న ఇంగ్లిష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించి డిజిటల్ విద్యా బోధన చేసే విధంగా చర్యలు చేపట్టిందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 197 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. మొదటి విడుత మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 70 పాఠశాలలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయా స్కూళ్లలో 12 రకాల అంశాలను మండలస్థాయి బృందాలు పరిశీలించి అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎంఈఓ బాలాజీనాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ ఆదినారాయణ పాల్గొన్నారు.
కమలమ్మ చిత్రపటానికి నివాళి
మిర్యాలగూడ : టీఆర్ఎస్ నాయకుడు మన్నెం శ్రీనివాస్‌రెడ్డి తల్లి కమలమ్మ ఇటీవల మృతి చెందారు. శనివారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు వారి ఇంటికి వెళ్లి కమలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పశ్య శ్రీనివాస్‌రెడ్డి, గంట శ్రవణ్‌రెడ్డి ఉన్నారు.