భువనగిరి అర్బన్, జూలై 8 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలోని రైతుబజార్ సమీపంలో ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. గ్యాస్ సిలిండర్లు, కట్టెలపొయ్యిపై వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు బాయ్ బాయ్ నరేంద్ర మోదీ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు నరాల నిర్మలావెంకటస్వామి, ఎరుకల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీలు గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి, బీరు మల్లయ్య, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కిరణ్‌కుమార్, ప్రధానకార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, చందుపట్ల వెంకటేశ్వర్రావు, పెంట నర్సింహ, కంచనపల్లి నర్సింగ్‌రావు, అందె శంకర్, పంగరెక్క స్వామి, శెట్టి బాలయ్య, చెన్న మహేశ్, గాదె శ్రీనివాస్, నక్కల చిరంజీవి, సిద్దుల పద్మ, నాగరం సూరజ్, గుర్రాల శ్రీశైలం, జక్కా వెంకట్‌రెడ్డి, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, చిందం మల్లికార్జున్, తాజ్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్, రైతుబంధు సమితి వలిగొండ మండల కన్వీనర్ పడమటి మమతానరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ బీబీనగర్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అక్బర్, నాయకులు కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.
కోదాడ టౌన్, జూలై 8 : కేంద్రం ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ కోదాడ పట్టణంలోని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తిరుమల ఆస్పత్రి వద్ద్ద ఖాళీ గ్యాస్ సిలిండర్లు ఉంచి కట్టెల పొయ్యిపై వంటలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవితారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు రూ. 400 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,105కు చేరిందన్నారు. పేదలకు పెనుభారంగా మారిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించకపోతే నిరసన సెగలను ఢిల్లీకి తాకేలా చేస్తామన్నారు.
నేరేడుచర్లలో..
నేరేడుచర్ల : వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచు తూ మోదీ సర్కార్ వంట గదిలో మంట పుటిస్తుందని కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు వూట్కూరి సైదులు అన్నారు. స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2014లో బీజీపీ ప్రభుత్వం రాక ముందు గ్యాస్ సిలిండర్ ధర రూ.450 ఉం ప్రస్తుతం దాన్ని రూ.1170 చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతూ పేదలపై పెనుభారం మోపుతుందన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని లేదంటే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సామాన్యులపై మోయలేని భారం
గరిడేపల్లి : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం మండల కార్యదర్శి షేక్ యాకూబ్ అన్నారు. మండలంలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత చర్యలతో సామాన్యులపై మోయలేని భారం పడుతున్నదన్నారు. సమావేశంలో వెంకటమ్మ, నిర్మల, పద్మ, ఎల్లమ్మ, అజీమా, లచ్చిరెడ్డి, తిరుపయ్య, సైదయ్య, హుస్సేన్ పాల్గొన్నారు.
పేదల నడ్డి విరుస్తున్న కేంద్రం
అనంతగిరి : కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలు విపరీతంగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నదని, వెంటనే ధరలు తగ్గించాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముసుగు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ధరను ఇటీవల మరోసారి పెంచి పేదవాడికి కట్టెల పొయ్యి దగ్గర చేస్తున్నారన్నారు.
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి
నూతనకల్ : గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్ గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ. ఎన్డీయే ప్రభుత్వం నిత్యావసర ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని దుయ్యబట్టారు నర్సయ్య, అవిలయ్య, రాంమల్లు, వెంకటయ్య, సైదులు పాల్గొన్నారు
హాలియా, జూలై 8 : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను తగ్గించే వరకు టీఆర్ఎస్ పేదల పక్షాన పోరాడుతుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. కేంద్రం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం హాలియాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నదన్నారు. బీజేపీ అధికారంలోనికి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గత యూపీఏ పాలనలో రూ. 450 ఉన్న వంట గ్యాస్ ధర నేడు 1,124 రూపాయలకు చేరిందన్నారు. దేశంలో కరోనా వచ్చి పేద లంతా పూట గడువక ఇబ్బంది పడుతుంటే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్లజ్జగా వంటగ్యాస్ ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తున్నదని ఆరోపించారు. అచ్చేదిన్ ఆగయా అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలను పెంచడంతో పేదలు చచ్చే రోజులు వచ్చాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను తగ్గించే వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కౌన్సిలర్లు ప్రసాద్‌నాయక్, అన్నెపాక శ్రీను, పార్టీ నాయకులు పిడిగం నాగయ్య, సత్యం, వెంకటేశ్వర్లు, అన్వరొద్దిన్, సైదులు, హరి, బాబుద్దిన్, రాంబాబు, చెన్నయ్య, మాల్యాద్రి, సోము, ఎల్లయ్య, జానకీరాములు పాల్గొన్నారు.