తిరుమలగిరి సాగర్, జులై 8 : తండాల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని నేతాపురం, మేగ్యాతండాల్లో రూ. 20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా చేసి వాటిని అభివృద్ధి పరిచేందుకు నిధులు కేటాయిస్తున్నదన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి మరిచినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతో పల్లెలను అభివృద్ధి చేస్తున్నదన్నారు. అంతకుముందు శీతలతండా ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింది రూ. 23 లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
మండలకేంద్రంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంఈఓ తరి రాము, ఎంపీడీఓ ఖాజా అస్గర్‌అలీ, సర్పంచ్ చందూలాల్, ఎంపీటీసీ భాగ్యశీశ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ గజ్జెల శ్రీనివాస్‌రెడ్డి, జంగాల లక్ష్మమ్మ, సాజీ బిచ్యానాయక్, తిరుమల్, సాయిప్రదీప్, యాదవ చైతన్యవేదిక జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, పిడిగం నాగయ్య, పెద్దిరాజు, నాసర్‌రెడ్డి, అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, మల్లికార్జున్, కోటిరెడ్డి పాల్గొన్నారు.