నల్లగొండ కలెక్టర్‌గా టి.వినయ్‌క్రిష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రశాంత్ జీవన్ పాటిల్ బదిలీ పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ నుంచి బాధ్యతలు తీసుకునారు. సూర్యాపేట కలెక్టర్‌గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.
నల్లగొండ, ఆగస్టు 10 : జిల్లా కలెక్టర్‌గా టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మెదక్ జిల్లాకు బదిలీ కాగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు కలెక్టర్ రా హుల్ శర్మకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సూర్యాపేట నుంచి బదిలీపై నల్లగొండకు వచ్చిన వినయ్ కృష్ణారెడ్డి రాహుల్ శర్మ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాహుల్ శర్మతో పాటు ఆర్డీఓ జగన్నాథరావు కొత్త కలెక్టర్‌కు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో బదిలీపై వచ్చిన భాస్కర్‌రావు కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. భాస్కర్‌రావు ఇప్పటి వరకు జనగామ అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. తాసీల్దార్ నాగార్జున రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఆయనకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ ఆర్డీఓ జగన్నాథరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి దాక ఆర్డీఓగా బాధ్యతలు నిర్వహించిన జగదీశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆయన స్థ్దానంలో ఏఎమ్మార్పీ యూనిట్-1 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జగన్నాథరావును ప్రభుత్వం నల్లగొండ ఆర్డీఓగా పోస్టింగ్ ఇచ్చింది.
సూర్యాపేట, ఆగస్టు 10 : సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి నల్లగొండకు బదిలీ కాగా స్థానిక సంస్థల అదనపు కలెక్టగా ఉన్న హేమంత్ కేశవ్ పాటిల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరా రు. ప్రజల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుతానన్నారు. అధికారులు కలెక్టర్‌కు పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.