నల్లగొండ, ఆగస్టు 1: దళిత వర్గాల అభ్యున్నతికే సీఎం కేసీఆర్ దళిత బంధు అమలు చేశాడని దీన్ని దళితులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక సాధికారత సాధించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కనగల్ మండలం చెట్ల చెన్నారం గ్రామస్తులకు దళిత బంధు యూనిట్లను సోమవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో లబ్ధ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ దేశంలో ఎవరూ ఊహించని పథకమంటే దళిత బంధు అన్నారు. దళిత బంధు పథకాన్ని దళిత సోదరులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెట్ల చెన్నారంలో 28 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కనగల్ ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, సర్పంచ్ గన్నెబోయిన గంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, అయితగోని యాదయ్య, రామగిరి శ్రీధర్ రావు, చంద్రయ్య పాల్గొన్నారు.
నల్లగొండ : ఎన్జీ, నీలగిరి, సిద్ధార్ధ కళాశాలలతో పాటు ఆయా కళాశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్వీలో చేరారు.. ఈ సందర్బంగా ఎన్జీ కళాశాల టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా బాలాజీ నాయక్‌ను ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు అంబటి ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, మహ్మద్ ఉమర్, ఉదయ్ కుమార్, కిరణ్, గోపాల్ పాల్గొన్నారు.
గుర్రంపోడ్ : నల్లగొండ 41వ వార్డు కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్‌రెడ్డి తండ్రి యాదగిరిరెడ్డి (60)ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోమవారం మండలంలోని వట్టికోడ్ లో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యాదగిరిరెడ్డి చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు.
పిట్టలగూడెం గ్రామానికి చెందిన విశ్రాంత వీఆర్ఓ చింతరెడ్డి యాదగిరిరెడ్డి (75) గుండెపోటుతో మృతి చెందగా ఆయన కుమారుడు ఆదిలాబాద్ ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారి నర్సింహారెడ్డిని పరామర్శించా రు. ఎమ్మెల్యే వెంట నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేశ్ గౌడ్, సర్పం చ్ కేసాని యాదగిరిరెడ్డి, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, కంచర్ల విజయేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.