వెళ్లిందని, వ్యాపారాల కోసమే ఆయన రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం చండూరులో విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడారు. గతంలో టీఆర్ఎస్లో చేరుతానని కనపడ్డవారి కాళ్లు పట్టుకుని బతిమిలాడిన విషయం మరిచి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని రాజగోపాల్‌రెడ్డిపై మండిపడ్డారు.
చండూరు, ఆగస్టు 1 : మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే నాలుక చీరేస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో సోమవారం పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక మునుగోడు ప్రజలకు ముఖం చూపెట్టలేక, అభివృద్ధి చేయలేక సొంత వ్యాపారాల కోసం రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. పూటకో మాట మాట్లాడుతూ కేఏ పాల్‌ను మించిపోయి ఆర్జీ పాల్గా మారాడని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టుల కోసం జన్మనిచ్చిన పార్టీని వదిలి అమిత్‌షా వద్ద మోకరిల్లి మునుగోడు ప్రజలను వెన్నుపోటు పొడిచిన నీచుడు రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్లో చేరుతానని కనపడ్డవారి కాళ్లు పట్టుకొని బతిమిలాడిన విషయం మరిచిపోయి సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నాడన్నారు. సీఎం కాలి గోటికి కూడా సరితూగడని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డిని రాజకీయంగా బొంద పెట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధ్దంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో కరువు తాండవించిందని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత రేయింబవళ్లు పనిచేసి ముఖ్యమంత్రి చలువతో అభివృద్ధి అంటే ఏమిటో చూపించానన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించేందుకు మునుగోడు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.