చౌటుప్పల్, జూలై 31 : మునుగోడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కనిపించడం లేదా అని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. చౌటుప్పల్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి తన రాజకీయ పబ్బం గడుపుకొనేందుకే ప్రభుత్వంపై అర్థం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నాడని విమర్శించారు.
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీని మెచ్చుకోవడం రాజగోపాల్‌రెడ్డికే చెల్లిందన్నారు. ఆయనకు ఓటు వేసి గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఆయన వెంట ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నాయకులు బొంగు జంగయ్యగౌడ్, ఉప్పు కృష్ణ ఉన్నారు.