రామగిరి, జూలై 27: ప్రతి అంశానికీ ఫిజిక్స్‌తో సంబంధం ఉంటుందని, ప్రస్తుత కాలంలో డ్రోన్ టెక్నాలజీపై అవగాహన అవసరమని ఓయూ ఫిజిక్స్ విభాగం విశ్రాంత ప్రొఫెసర్ కె.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఎంజీయూలో డిపార్టుమెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో ఎంజీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ఫిజిక్స్ అధ్యాపకులకు నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎఫ్డీపీ) బుధవారం రెండోరోజు కొనసాగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేణుగోపాల్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో ఎవల్యూషన్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ అనే అంశంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎస్.శ్రీనాథ్ మాగ్నటిక్ చర్యలు, జి.వెంకటయ్య బ్యాండ్ థియర్ ఆఫ్ సాలిడ్స్ అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్స్ అనే అంశాన్ని సీనియర్ అధ్యాపకుడు డి.లింగారెడ్డి వివరించారు. ఎఫ్డీపీ డైరెక్టర్ పి.యాదగిరిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎఫ్డీపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ భిక్షమయ్య, రమేశ్, సత్తిరెడ్డి పాల్గొన్నారు.