WI vs SCO : టీ20 ప్రపంచకప్ తొలి లీగ్ మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్‌మైర్(64) చెలరేగాడు. ఈడెన్ గార్డెన్స్‌లో స్కాట్లాండ్ బౌలర్లను ఉతికేస్తూ మెరుపు అర్థ శతకంతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్(35) శుభారంభమివ్వగా.. హిట్మైర్ భారీ సిక్సర్లతో అలరించాడు. రొవ్మన్ పావెల్(24) జతగా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు ప్రపంచకప్‌లో విండీస్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. ఆఖర్లో షెర్ఫానే రూథర్‌ఫోర్డ్(26) దంచేయగా నిర్ణీత ఓవర్లలో విండీస్ 182 పరుగులు చేసింది.
ప్రపంచకప్ ఆరంభ పోరులో వెస్టిండీస్ భారీ స్కోర్ బాదింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఓపెనర్లు బ్రాండన్ కింగ్(35), షాయ్ హోప్(19)లు శుభారంభమివ్వగా షిమ్రాన్ హిట్మైర్(64) విధ్వంసక అర్ధశతకంతో స్కాట్లాండ్ బౌలర్లను బెంబేలెత్తించాడు. లీస్క్ ఓవర్లో హోప్ బౌల్డయ్యాక క్రీజులోకి వచ్చిన హిట్మైర్ తొలి బంతినే గాల్లోకి లేపి ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. ఐపీఎల్ అనుభవంతో రెచ్చిపోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 22 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు.
First 10 overs: 66 runs
Last 10 overs: 116 runsA good last two overs from Scotland after Hetmyer’s fireworks – have West Indies got a winning total?
Ball-by-ball: https://t.co/tsTRL6Xvyi pic.twitter.com/rev4E4eiW5
— ESPNcricinfo (@ESPNcricinfo) February 7, 2026
మరో ఎండ్‌లో రొవ్మన్ పావెల్(24)సైతం ధనాధన్ ఆడాడు. మూడో వికెట్‌కు 80 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని విడదీశాడు. కాసేపటికే బ్రాడ్ కర్రీ బౌలింగ్‌లో హిట్మైర్ ఔట్ కాగా.. షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ మెరుపు ఇన్నింగ్స్‌తో స్కాట్లాండ్ బౌలర్లను హడలెత్తించాడు. ఆఖరి ఓవర్లో రొమారియో షెపర్డ్(6 నాటౌట్) సిక్సర్ బాదగా విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగలిగింది.