Nilave Trailer | టాలీవుడ్ యువ నటులు సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిలవే’ (Nilave). వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుండగా తాజాగా ట్రైలర్‌ను వదిలింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినీ ప్రియులు దీనిని సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పోలుస్తున్నారు. ట్రైలర్లో హీరో ఎమోషన్స్, మేకింగ్ స్టైల్ మరియు రొమాంటిక్ సీన్స్ చాలా రా (Raw) గా మరియు బోల్డ్‌గా ఉండటంతో , నెటిజన్లు దర్శకుడు సౌమిత్ రావును సందీప్ వంగా స్టూడెంట్‌లా ఉన్నాడే అని ప్రశంసిస్తున్నారు. లవ్‌స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. సౌమిత్ రావు & సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతాన్ని అందించాడు.