మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. సోమవారం ఆలేరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో నిర్మించిన పీర్ల కొట్టాన్ని డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. షాదీముబారక్, మైనార్టీ గురుకులాలతో నాణ్యమైన విద్య, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని సునీత పేర్కొన్నారు.
ఆలేరు, జూలై 25: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆలేరు 11వ వార్డులో రూ.5 లక్షలతో నిర్మించిన అబ్బాసి అలాన్ అషుర్ ఖానా(పీర్ల కొట్టం)ను డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు.
షాదీ ముబారక్ ద్వారా ఆడబిడ్డల వివాహాలకు రూ. లక్షా116 అందజేస్తున్నదన్నారు. మైనార్టీలకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో వందలాది గురుకుల పాఠశాలలను ప్రభుత్వం నెలకొల్పిందని వారు గుర్తు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా మసీదుల మరమ్మతులకు, పీర్ల కొట్టాల నిర్మాణాలకు రూ.2 కోట్ల 8 లక్షల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు.
ఇమామ్, మౌజంలకు నెల నెలా గౌరవ వేతనం అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి కార్యక్రమంలో మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు వస్పరి శంకరయ్య, గడ్డమీది రవీందర్‌గౌడ్, కౌన్సిలర్లు జూకంటి శ్రీకాంత్, రాయపురం నర్సింహులు, కందుల శ్రీకాంత్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పట్ట మల్లేశ్, జనరల్ సెక్రెటరీ కుండె సంపత్, ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ, ముస్లిం మతపెద్దలు ఎండీ.ఖాసీం, అబ్బాస్, నసీరుద్దీన్, సాధిక్, నాయకులు షాబొద్దీన్, రియాజ్, ఎండీ.ఫయాజ్, మహమూద్ పాల్గొన్నారు.