మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడంతో స్థానిక ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ చొరవతోనే తమ కల సాకారమైందని, అందుకే కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కానున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా ఉత్సాహం కనబరుస్తున్నారు. కోలాటాలు, ధూమ్‌ధామ్‌తో పాటు అంబరాన్నంటే సంబురాలతో కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే గట్టుప్పల్ మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం సోమవారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో కూసుకుంట్ల ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. మాజీ సర్పంచ్ ముత్తిరెడ్డితోపాటు కాంగ్రెస్, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
చండూరు, జూలై 25 : మునుగోడు నియోజకవర్గాన్ని సూర్యాపేటతో సమానంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. కొత్త మండలంగా రూపాంతరం చెందిన గట్టుప్పల్ మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసంతోపాటు 200 మంది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మునుగోడు శాసన సభ్యుడు రాజగోపాల్‌రెడ్డికి వ్యాపకాలు, వ్యాపారాలు ఎక్కువని, అందుకే ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో ఇటువంటి నేతల ఏలుబడిలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ పెరిగిందని తెలిపారు. ఆ పాపం కాంగ్రెస్‌దేనని, పదవుల కోసం ప్రజలను పట్టించుకోని నాయకులు వారేనని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు జనం ఆదరణ కరువైందని, మోసకారి పార్టీగా గుర్తింపు వచ్చిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో యావత్ దేశం తెలంగాణవైపు చూస్తున్నదని, అందుకే ఇతర పార్టీల నాయకులు, ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. గట్టుప్పల మండల ఏర్పాటు ప్రజల కల అని, అది సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని కొనియాడారు. మిషన్ భగీరథతో మునుగోడు నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఫ్లోరైడ్ పీడ నుంచి రక్షించించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.
కార్యక్రమంలో చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గట్టుప్పల మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసంతోపాటు మాజీ సర్పంచ్ పోరెడ్డి ముత్తిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు భీమగాని మహేశ్, కాంగ్రెస్ నాయకులు బొల్లేపల్లి వెంకటేశం, తెలుగుదేశం సీనియర్ నాయకులు సుంకరి జంగయ్య, గంజి పెద్దులు, గంజి పరంధాములు, సంగెపు శ్రీహరి, పెద్దగాని రాములు, గడగోటి నర్సింహ, బడుగు తిమ్మయ్య, ఏడుపుల రాములు, మొద్దు తిరుపతయ్య, మొద్దు రాములు, దుబ్బాక రాములు, కురుమర్తి జంగయ్య, వడ్డెపల్లి మారమ్మ, కమ్మం పెంటమ్మ, దుబ్బాక ముత్తమ్మ, దుబ్బాక లింగమ్మ, కమ్మం ముత్తమ్మ, ఈదమ్మ మొత్తం 200 మంది ఉన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్‌ను మండలకేంద్రంగా ప్రకటించడంతో స్థానిక ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి పి.మల్లేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పేర్కొన్నారు.
మర్రిగూడ, జూలై 25 : గట్టుప్పల్‌లో మంగళవారం నిర్వహించ తలపెట్టిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనున్నారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా బహిరంగసభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి విజయ వంతం చేయాలని కోరారు.
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్