నేరేడుచర్ల, జూన్ 30 : వానకాలం సీజన్ ప్రాంభమైంది. రైతులు పొలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. విత్తనాలు కొనుగోలులో రైతులు అప్రమత్తంగా ఉండాలి. నాణ్యతలేని లూజ్ విత్తనాలు తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. లూజ్, కంపెనీ విత్తనాల్లో తేడా తెలుసుకోవాలి.
రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో లైసెన్సు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసుకోవాలి. తప్పక రసీదు తీసుకోవాలి. పంట కాలం పూర్తయ్యే వరకు రసీదును భద్రంగా ఉంచుకోవాలి. రైతులు తొందర పడి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. విత్తనాల కొనుగోలులో అనుమానం ఉంటే స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించాలి.