తిరుమలగిరి, జూన్ 30 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్‌సాగర్‌ను సీఎం కేసీఆర్ ఫుడ్ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్‌గా నియమించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మరో ఉద్యమకారుడికి కార్పొరేషన్ పదవి ఇవ్వడంపై టీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాజీవ్‌సాగర్ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో కీలకంగా నిలిచారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్ఫూర్తితో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ జాగృతిలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు కేసీఆర్ కప్ లాంటి టోర్నీలు నిర్వహించి ఉత్సాహం నింపారు. పేదలకు అండగా ఉంటూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్‌సాగర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. రాజీవ్‌సాగర్ నియామకంపై టీఆర్ఎస్, జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలగిరిలో గురువారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యూత్ అధ్యక్షుడు సతీశ్‌రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షుడు అబ్దుల్ గఫార్, శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, కాసాని శ్యామ్ లింగయ్య, రాజు, యాదగిరి పాల్గొన్నారు.