నీలగిరి, జూన్ 30 : నల్లగొండ పట్టణంలో రూ. 250 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నల్లగొండను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పట్టణంలో మొదటి దశలో చేపట్టిన పనుల ప్రారంభానికి జూలై మూడో వారంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నల్లగొండకు రానున్నట్లు చెప్పారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ పిల్లి రామరాజు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా వాటిని త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి, ఏసీపీ నాగిరెడ్డి, ఈఈ శ్రీనివాస్, టీపీఓ శివ, కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, ఖయ్యూంబేగ్, అలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, ఇబ్రహీం, మారగోని భవానీగణేశ్ పాల్గొన్నారు.