నల్లగొండ, జూన్ 25 : శ్రీవల్లి టౌన్షిప్లో ప్లాట్లతోపాటు గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారు వేలంలో పాల్గొనాలంటే నేడే చివరి రోజని, ఆసక్తి కలిగినవారు వేలంలో పాల్గొనాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెంలో రాజీవ్ స్వగృహ శ్రీ వల్లి టౌన్షిప్ ఓపెన్ ప్లాట్లతోపాటు ఇండ్లకు సంబంధించిన వేలం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో శనివారం ఆరో రోజూ కొనసాగింది. ఆసక్తి కలిగిన బిడ్డర్లు పెద్ద ఎత్తున వేలంలో పాల్గొని ప్లాట్లతోపాటు ఇండ్లను దక్కించుకున్నారు.
ఇప్పటివరకు రూ.4.81 కోట్ల విలువైన ప్లాట్లు, ఇండ్లను బిడ్డర్లు కొనుగోలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. ప్లాట్ లేదా ఇల్లు కావాలనుకునే వారు కలెక్టరేట్లో రూ.10వేల డీడీ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. బ్యాంకులు సైతం ఇండ్లకు రుణాలు ఇస్తాయన్నారు. వేలానికి ఆదివారం ఒక్కరోజే అవకాశం ఉన్నందున ఆసక్తి కలిగిన వారు బిడ్డింగ్‌లో పాల్గొనాలని సూచించారు. వివరాల కోసం 9154339209 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, వీసీపీఓ బాలశౌరి, రాజీవ్ స్వగృహ ప్రాజెక్టు మేనేజర్ షఫీయొద్దీన్ పాల్గొన్నారు.