రామన్నపేట / బీబీనగర్ / బీబీనగర్(భూదాన్‌పోచంపల్లి) / రాజాపేట/ఆలేరు రూరల్/మోటకొండూరు / వలిగొండ / ఆత్మకూరు(ఎం), జూన్ 25 : జిల్లాలో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ పమేలా సత్పతి శనివారం కలెక్టరేట్లో ప్రశంసాపత్రాలు అందించి సన్మానించింది. వలిగొండ ఎంపీడీఓ గీతారెడ్డి, మండలంలోని సంగెం గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్‌కాంత్‌కు ప్రశంసాపత్రాలు అందించారు. రామన్నపేట మండలంలోని ఏఎస్డబ్ల్యూఓ సిరిపురం గ్రామ ప్రత్యేకాధికారి రఘురామయ్య, ఇంద్రపాలనగరం కార్యదర్శి రసూల్, మల్టీపర్పస్ వర్కర్ లక్ష్మమ్మ ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి ఉత్తమ పురస్కారం అందుకున్నారు. బీబీనగర్ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికురాలు పొట్ట యాదమ్మ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. రాజాపేట మండలం కొన్రెడ్డిచెర్వు గ్రామ పంచాయతీ కార్యదర్శి సిద్ధేశ్వర్, ఆలేరు మండలం టంగుటూరు గ్రామపంచాయతీ కార్యదర్శి రాహుల్‌రెడ్డి, మోటకొండూరు మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కోటేశ్ ఉత్తమ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఆత్మకూరు(ఎం) పంచాయతీ పారిశుధ్య కార్మికుడు నల్ల ముత్తయ్య ఉత్తమ ప్రశంసాపత్రం అందుకున్నారు.
భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నాలుగో విడుత పట్టణ ప్రగతి, ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన సిబ్బందిని కలెక్టరేట్లో శనివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా వార్డుల్లో, గ్రామాల్లో అధికారులు చేపట్టే కార్యక్రమాల అనంతరం చెత్తా చెదారాన్ని శుభ్రంచేసే పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతచెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌తివారీ, డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, డీపీఓ సునంద, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంఎస్ఓలు పాల్గొన్నారు.