తుర్కపల్లి, జూన్ 25 : పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని దత్తాయిపల్లి హైస్కూల్, ప్రాథమిక పాఠశాలకు మంజూరైన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైస్కూల్‌కు రూ.28.50లక్షలు, ప్రాథమిక పాఠశాలకు రూ.26.50లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రామ్మోహన్‌శర్మ, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, మాధవరం కృష్ణ, గుండా ప్రభాకర్, కేతమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ తండ మంగమ్మాశ్రీశైలంగౌడ్, జడ్పీటీసీ కె.నరేందర్‌గుప్తా అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా తరగతి గదుల్లో విద్యుత్ పరికరాల ఏర్పాటును ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ జన్నాయికోడె నగేశ్, ఎంపీటీసీ యాస కవిత, ఎస్ఎంసీ చైర్మన్ కోరె బీరప్ప, ప్రధానోపాధ్యాయుడు తీపిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.