యాదాద్రి, జూన్ 17 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మి అమ్మవారిని పూలు, పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఊయలలో శయనింపు చేయించారు. స్వయంభూ నారసింహుడికి నిత్యారాధనలు నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ నిర్వహించారు. బిందె తీర్థం నిర్వహించి లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు ప్రాకార మండపంలో నిత్య తిరుకల్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం స్వామివారి నిజాభిషేకం, సహస్రనామార్చన జరిపారు. స్వయంభూ ప్రధానాలయంలోని ముఖ మండపంలో పలువురు భక్తులు సువర్ణ పుష్పార్చన చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులను అర్చించారు. స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 15 వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య పూజలు కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.18,11,318 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,78,050
వీఐపీ దర్శనం 82,500
వేద ఆశీర్వచనం 14,400
సుప్రభాతం 3,100
క్యారీ బ్యాగుల విక్రయం 14,000
వ్రత పూజలు 1,05,600
కల్యాణ కట్ట టిక్కెట్లు 25,800
ప్రసాద విక్రయం 8,54,400
వాహన పూజలు 9,300
అన్నదాన విరాళం 31,452
శాశ్వత పూజలు 50,000
సువర్ణ పుష్పార్చన 1,27,116
యాదరుషి నిలయం 68,900
పాతగుట్ట నుంచి 20,900
కొండపైకి వాహనాల ప్రవేశం 2,25,000
లక్ష్మీ పుష్కరిణి 600