కోదాడ రూరల్, జూన్ 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిపై మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ తాసీల్దార్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలి. రోడ్లు, కాల్వల వెంట మొక్కలు నాటేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హరితహారం విజయవంతానికి అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం మీసేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని, ప్రతి దరఖాస్తు సంబంధించిన ప్రతాలను అప్లోడ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిశోర్‌కుమార్, తాసీల్దార్ శ్రీనివాసశర్మ, ఎంపీడీఓ విజయశ్రీ పాల్గొన్నారు.
మఠంపల్లి : గ్రామాల్లో పారిశుధ్యంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని డీపీఓ యాదయ్య అన్నారు. మండలంలోని పెదవీడు గ్రామంలో గురువారం రాత్రి పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పెదవీడుతోపాటు మండల కేంద్రంలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను పరిశీలించారు. సైడ్ కాల్వలు, రహదారులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. 8వ విడుత హరితాహారానికి కావాల్సిన మొక్కలను సమకూర్చాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముడావత్ పార్వతీకొండానాయక్, ఎంపీడీఓ జానకిరాములు, ఎంపీఓ ఆంజనేయులు, జడ్పీటీసీ జగన్నాయక్, సర్పంచులు మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, బీబీకుతుబ్, ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కోదాడ టౌన్ : పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 18, 31, 35వ వార్డుల్లో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైనేజీలను శుభ్రపరిచి, విద్యుత్ మరమ్మతు పనులు చేశామన్నారు. అనంతరం 25వ వార్డులో కొత్తగా నిర్మిస్తున్న చేపల మార్కెట్ షెడ్ నిర్మాణ పనులను పరిశీలించి, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్ కర్రి శివ సుబ్బారావు, సుశీల రాజు, లలిత, సుధాకర్, మున్సిపల్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
మోతె : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓ శంకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నామవరం, బీక్యాతండాల్లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ హరిసింగ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గరిడేపల్లి : ఐదో విడుత పల్లెప్రగతి పనులు శుక్రవారం కొనసాగాయి. వివిధ గ్రామాల్లో ప్రత్యేకాధికారులు, సర్పంచులు గ్రామాల్లో నీటి పారుదలశాఖ వారి ఆధ్వర్యంలో కాల్వగట్లు, చెరువుగట్లు,ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటించారు. మొక్క లకు నీరుపోయడంతోపాటు డ్రై డేను పాటించారు. గరిడేపల్లిలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్, ఇన్చార్జి ఎంపీడీఓ లావణ్య పరిశీలించి రోడ్లను శుభ్రం చేశారు. కార్యక్రమాల్లో గరిడేపల్లి సర్పంచ్ సీతారాంరెడ్డి, ఉప సర్పంచ్ సైదాబీ రాజ్‌మహ్మద్, వార్డు సభ్యులు రాంరెడ్డి, నారాయణ, సర్పంచులు ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : మండలంలోని పెంచికల్‌దిన్న గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను శుక్రవారం ఎంపీడీఓ శంకరయ్య పరిశీలించారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో జరుగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుంకర వాణిశ్రీరాంమూర్తి, ఎంపీటీసీ లింగయ్య, ప్రత్యేక అధికారి శేఖర్, కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : పట్టణ ప్రగతితో హుజూర్నగర్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులు అభివృద్ధి చెందుతున్నాయని టీఆర్ఎస్ జిల్లానాయకులు గెల్లి రవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 24వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మురుగు కాల్వలు శుభ్రపరిచి పిచ్చి మొక్కలను తొలగించారు. వీధిదీపాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జక్కుల శంభయ్య, వార్డు అధ్యక్షుడు ఎడ్ల విజయ్, ఉపేందర్, లతీఫ్, వెంకన్న, యాకూబ్, వెంకటరమణ, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
పాలకవీడు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి పనులు గ్రామాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం రాఘవాపురం, మూసీఒడ్డు సింగారం, ఎల్లాపురం గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. డ్రైనేజీ కాల్వల్లో పూడిక తొలగించారు. వీధుల్లో బ్లీచింగ్‌ను చల్లారు. కార్యక్రమాల్లో సర్పంచులు వెంకటమ్మ, వెంకటరమణ, తీగల లక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు గోపాల్ ఉన్నారు.
నడిగూడెం : పల్లె ప్రగతిలో గ్రామస్తులు భాగస్వాములయ్యేలా చూడాలని ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు అన్నారు. మండలంలోని చాకిరాలలో గురువారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పంచాయతీ అవరణలో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి శ్రీనివాస్, కార్యదర్శి భూలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు రేణుక, మౌనిక, ఆశ కార్యకర్త ఉషారాణి పాల్గొన్నారు.