కొండమల్లేపల్లి, జూన్ 17 : కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం నిర్వహిస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నా రు. మన ఊరు-మన బడిలో భాగంగా శుక్రవారం మండలంలోని చింతకుంట్ల గ్రామం లో రూ.38.78లక్షలు, రమావత్తండాలో రూ.42.75లక్షలు, పెండ్లిపాకలలో రూ. 42.75లక్షలు, గుడితండాలో రూ.6.03లక్షలతో చేపడుతున్న పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతుందని తెలిపారు.
పెండ్లిపాకలలో క్రీడా ప్రాంగణం ప్రారంభం… మండలంలోని పెండ్లిపాకల గ్రామంలో క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రాష్ట్రప్రభుత్వం గ్రామానికో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ దూదిపాల రేఖారెడ్డి, ఎంపీడీఓ బాలరాజురెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, ఎంఈఓ మాత్రునాయక్, జడ్పీటీసీ సలహాదారుడు పస్నూరి యుగేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, నేనావత్ రాంబాబునాయక్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, సర్పంచులు మేకల సావిత్రీశ్రీనివాస్, నేనావత్ అంజలీరాంబాబు, రమావత్ బంగారీరూప్ల, ఎంపీటీసీ నేనావత్ రజిత, వస్కుల కాశయ్య, వెంకట్‌రెడ్డి, రమావత్ తులసీరాం, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
దేవరకొండ రూరల్ : మండలంలోని శేరిపల్లిలో దత్త గోశాలను ఎమెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం ప్రారంభించారు. మారుమూల ప్రాంతంలో గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సర్పంచ్ మాడెం సత్తయ్య ఎమ్మెల్యేను సన్మానించారు. జడ్పీటీసీ మారుపాక అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, రేపాని ఇద్దయ్య, ఎంపీటీసీ రమావత్ నర్సింహ, శ్రీను, యాదవాచారి, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.