తుంగతుర్తి : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ భీమ్సింగ్నాయక్ తెలిపారు. గురువారం మండలంలోని కర్విరాల కొత్తగూడెం, గానుగుబండ, తూర్పుగూడెం గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా వీధులను, మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి మాట్లాడారు. రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నకిరేకంటి విజయ్, మిర్యాల అనితాజనార్దన్, గుజ్జ పూలమ్మ, నల్లు రాంచంద్రారెడ్డి, యాకూనాయక్ పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు అన్నారు. మండలంలోని బాలెంల గ్రామంలో పల్లె ప్రగతి పనులను పరిశీలించి మాట్లాడారు. గ్రామంలో చెత్త, మురుగు కాల్వలను శుభ్రం చేశారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విక్రమ్ పాల్గొన్నారు.
హుజూర్నగర్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సర్పంచ్ అన్నెం శిరీషాకొండారెడ్డి, ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి అన్నారు. మండలంలోని వేపలసింగారంలో పల్లె ప్రగతిలో భాగంగా పిచ్చి మొక్కలు, పారిశుధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓ మౌలానా, ఉప సర్పంచ్ కర్ణె సావిత్రీవీరారెడ్డి, సభ్యులు వరలక్ష్మి, హుసేనమ్మ, సైదమ్మ, కార్యదర్శి పెండెం నాగమణి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.