ప్రభుత్వం వెల్లడించే ఉద్యోగ పోటీ పరీక్షలు అనగానే యువతలో ఏదో తెలియని భయం ఉంటుంది. ఎలా ప్రిపేర్ కావాలి ? ఏం చదువాలి ? ఎలా చదువాలి? ఒత్తిడిని ఎలా జయించాలి? గమ్యాన్ని ఎలా చేరుకోవాలి? ఇలా ఎన్నో సందేహాలు ప్రతి అభ్యర్థి మదిలో ఉండే ఆందోళన. ఇలాంటి వాటిని దూరం చేసి విజయం సాధించేలా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే గొప్ప సువర్ణావకాశం కల్పిస్తున్నది. పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సౌజన్యంతో నేడు ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది.
హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్స్‌లో సోమవారం ఉదయం 10గంటలకు నిర్వహించే ఈ సదస్సుకు సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ మల్లవరపు బాలలత, వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప వక్తలుగా హాజరవుతున్నారు. ఆత్మీయ అతిథులుగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, ఎస్పీ రెమా రాజేశ్వరి వస్తున్నారు. వక్తలు అభ్యర్థుల భయాలు, అనుమానాలు తొలగించడంతోపాటు పోటీ పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేయనున్నారు. నమస్తే తెలంగాణ అందించే ఈ సదస్సుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.
వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం నమస్తే తెలంగాణ దినపత్రిక నిపుణ పేరిట ప్రత్యేక సంచిక ఇస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇందులో భాగంగా అభ్యర్థుల సౌలభ్యం కోసం 2022 ఏప్రిల్ 2నుంచి ప్రతి రోజూ జిల్లా టాబ్లాయిడ్లో నాలుగు పేజీలు (ఇంగ్లిష్, తెలుగు మీడియంలో), ప్రతి బుధవారం ఎనిమిది పేజీల ప్రత్యేక అనుబంధం ఇస్తూ వస్తున్నది. అంతేకాకుండా ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి ఉచిత అవగాహన కల్పించాలనే సంకల్పంతో సోమవారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నది.
ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో భయం తొలగించి భరోసా కల్పించేలా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిపుణుల సలహాలు, ప్రామాణిక స్టడీ మెటీరియల్స్ అందిస్తున్నాయి. తాజాగా నోటిఫికేషన్లు విడుదలవుతున్న సమయంలో అభ్యర్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది. నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్స్‌లో సోమవారం ఉదయం 10గంటలకు నిర్వహించే ఈ సదస్సుకు సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ మల్లవరపు బాలలత, వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప వక్తలుగా హాజరవుతున్నారు. ఆత్మీయ అతిథులుగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, ఎస్పీ రెమా రాజేశ్వరి పాల్గొంటారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో భయం, అనుమానాలు తొలగించడం, పలు విషయాల్లో దిశానిర్దేశం చేసేలా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ నేడు సదస్సు నిర్వహిస్తున్నది. ఇలాంటి ఉచిత అవగాహన సదస్సులు ఉద్యోగార్థులకు ఎంతో ఉపయోగపడుతాయి. లక్ష్యాలను చేరుకోవడంలో కీలకంగా నిలుస్తాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసవిని తట్టుకుని ప్రశాంతంగా వినేలా ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తుండడం గొప్ప విషయం. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు ఉదయం 10గంటలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలి.