పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని నమ్మి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని, పల్లెలు సుందరవనాల్లా మారుతున్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం మోటకొండూరు మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ఆమె పర్యటించారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, నర్సరీని పరిశీలించారు. పల్లె ప్రగతిలో గుర్తించిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మేడికుంటపల్లి, దిలావర్పూర్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు.
మోటకొండూర్ / ఆలేరు రూరల్, జూన్ 10 : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సుందరవనాలుగా మారుతు న్నాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె మోటకొండూర్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ప్రగతి పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని కోరారు.
రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకంపై అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరు దివ్యాంగులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కలిశారు. దివ్యాంగులు స్థిరంగా ఒకేచోట ఉంటూ చిన్న తరహా వ్యాపారం చేసుకునేలా బ్యాంకు నుంచి ఏదైనా రుణసాయం అందేలా చూడాలని ఎంపీడీఓకు సూచించారు. అదేవిధంగా మోటకొండూర్ మండలంలోని మేడికుంటపల్లి, దిలావర్పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. అనంతరం మేడికుంటపల్లి గ్రామంలో సరదాగా వాలీబాల్ ఆడారు. దిలావర్పూర్లో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు.
కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్‌గౌడ్, వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, నార్ముల్ డైరెక్టర్ లింగాల శ్రీకర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి పరిమళాదేవి, ఎంపీడీఓ వీరస్వామి, ఎంపీఓ కిషన్‌కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, విద్యుత్ ఏఈ వెంకటేశ్, సర్పంచులు పన్నాల బాయమ్మ, మారబోయిన సిద్ధులు, చొప్పరి మాధ వి, ఉపసర్పంచ్ దామోదర్‌గౌడ్ పాల్గొన్నారు. అదేవిధంగా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, ఎంపీఓ సలీం, పంచాయతీ కార్యదర్శి రాహుల్‌రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తుర్కపల్లి : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, ఏఎంపీ డైరెక్టర్ మంజుల పాల్గొన్నారు.