మునుగోడు, జూన్ 10 : మండలంలోని జక్కలివారిగూడెంలో స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్బీఎం) బృందం శుక్రవారం పర్యటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా గ్రామా ల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. అభివృద్ధి పనులను భారత ప్రభుత్వ సలహాదారు ఉమాశంకర్ పాండే పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సెగ్రిగేషన్ షెడ్డులో చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ విధానం, మొక్కలకు వినియోగిస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు సుశాంత్‌కుమార్ బారిక్, రవికుమార్, స్వచ్ఛభారత్ మిషన్ సలహాదారులు శంకర్‌బాబు, మొయిహినొద్దీన్, ఎంపీపీ కర్నాటి స్వామి, ఎంపీఓ సుమలత, ఏపీఓ శ్రీనయ్య, సర్పంచ్ జక్కలి శ్రీను టీఏ నాగయ్య, పాల్గొన్నారు.
కనగల్: మండలంలోని దర్వేశిపురం ఆలయ పరిసరాల్లో నల్లగొండ-దేవరకొండ రోడ్డు వెంట ఉపాధి హామీ పథకం కింద అవెన్యూ ఫ్లాంటేషన్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను శుక్రవారం సాయంత్రం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ , కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి పరిశీలించారు. వారి వెంట అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, డీఆర్డీఓ కాళిందిని, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధ్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్: మండలంలోని శ్రీనివాసనగర్ గ్రామ పంచాయతీకి చేరుకున్న స్వచ్ఛభారత్ మిషన్ అధికారులు సర్పంచ్ బోగవిల్లి వెంకటరమణ చౌదరి, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. అనంతరం గ్రామంలో చేపట్టిన కంపోస్టు షెడ్డ్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, గ్రంథాలయం, ఓపెన్ జిమ్‌ను, ఇంకుడు గుంతలు శానిటేషన్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధ్ది పనులను చూసి ప్రశంసించారు. కార్యక్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్టెంట్ ఉమాశంకర్ పాండే , రవికుమార్ ,జిల్లా కోర్డినేటర్ శంకర్‌బాబు, ఎంపీఓ టి.వీరారెడ్డి, ఏపీఓ శిరీష, కార్యదర్శి గజెల అనితారెడ్డి పాల్గొన్నారు.
డిండి : మండలంలోని రహమంతాపూర్లో ఉపాధి హామీ పనులను కేంద్ర ఎంఆర్డీ బృందం, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనం, నర్సరీ, ఉపాధి పనులు చేపట్టిన రామేశ్వరం చెరువును పరిశీలించారు. ఉపాధి హామీ జాబ్ కార్డులను పరిశీలించి నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ డా.శరత్, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ దానియెల్, ఏపీఓ జయరాజ్, ఎంపీఓ కేదారినాథ్ పాల్గొన్నారు.
దేవరకొండరూరల్ : మండలంలోని కొండభీమనపల్లిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను కేంద్రబృందం సభ్యులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామానికి చేరుకున్న అధికారులకు, సర్పంచ్ మునికుంట్ల విద్యావతీవెంకట్రెడ్డి, గ్రామస్తులు పూల మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ రికార్డులను, ఎస్సీ కాలనీలో ఇంకుడు గుంతల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఎం.కిషన్ అనే రైతు పొలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కందకాల తవ్వకం, గులకరాళ్ల ఏరివేత పనులను పరిశీలించి తనిఖీ చేశారు. కార్యక్రమంలో హెచ్. సుతార్, రాజ్కుమార్ప్రసాద్, పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణశర్మ, పంచాయతీ రాజ్ ఏఈ శంకర్ పాల్గొన్నారు.