పెద్దవూర, జూన్ 10 : గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాయనవానికుంట తండాలో ఎస్డీఎఫ్ నిధులు 20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా మారడంతో సీజినల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. అనతరం బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, వసతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీఆర్ ఏఈ రామకృష్ణ, మండల వ్యవసాయ అధికారి సందీప్ కుమార్, ఎంపీఓ విజయ కుమారి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, మండల కో- ఆప్షన్ సభ్యుడు షేక్ బషీర్, సర్పంచ్ రమావత్ జానీ వెంకటేశ్వర్లు, నాయకులు నడ్డి బాలరాజు యాదవ్, నాగరాజు యాదవ్, హంజానాయక్, హూస్సేన్ నాయక్ పాల్గొన్నారు.
దామరచర్ల : పల్లెప్రగతితో తండాల రూపురేఖలు మారుతున్నాయని మండల ప్రత్యేకాధికారి, ఏడీఏ పి. నాగమణి అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా శుక్రవారం మండలంలోని వాచ్యాతండాలో ర్యాలీ నిర్వహించారు. తండాలో ప్రజలతో కలసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ లావూరి శ్రీనివాస్‌నాయక్, ఎంపీటీసీ సైది, ఏఈఓ పార్వతి, ఏఎమ్‌సీ వైస్‌చైర్మన్ లావూరి మేగ్యానాయక్, లక్కీనాయక్, జానకిరాములు, ఆశవర్కర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చండూర్ : పల్లెప్రగతితో గ్రామాలు పరిశుభ్రంగా మారాయని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గొరిగె సత్తయ్య అన్నారు. మండలంలోని తేరటుపల్లి గ్రామంలో శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలో ఉన్న పిచ్చి మొక్కలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తొలగించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారానే గ్రామాలకు ట్రాక్టర్లు, వైకుంఠధామాలు, డంపిండ్ యార్డులు సమకూరాయన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్ట ప్రభాకర్, గ్రామ ప్రత్యేకాధికారి సుధాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివ, బొట్ట గోవర్దన్, యాదయ్య పాల్గొన్నారు.
శాలిగౌరారం : గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడినప్పుడే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మనిమద్దె గ్రామ ప్రత్యేకాధికారి నవీన్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామంలో జేసీబీ సాయంతో రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలగించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ, అంకర్ల సత్తయ్య పాల్గొన్నారు.