తుంగతుర్తి, జూన్ 3 : గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసమే పల్లె ప్రగతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రోడ్డు వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత బావులు, ఇండ్లు, నూతన డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.3 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం తుంగతుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా పరిషత్ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాల లాబొరేటరీ కోసం రూ.21 లక్షల 50 వేలు మంజూరు చేసి ల్యాబ్ పరికరాలను సంబందిత హెచ్ఎంలకు పంపిణీ చేశారు.
రావులపల్లిలోని బొడ్రాయి మహోత్సవానికి ఎమ్మెల్యే తనవంతు సహాయంగా రూ.50 వేలు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరిగౌడ్, తాసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ భీమ్‌సింగ్, ఎంఈఓ బోయిని లింగయ్య, సర్పంచ్ మామిడి వెంకన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, కటకం వెంకటేశ్వర్లు, నల్లు రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : మండలంలోని రామారం గ్రామంలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం పాల్గొన్నారు. గ్రామ సభలో వారు మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, సర్పంచ్ బొల్లం సుమతీనాగరాజు, ఏఈఓ శైలజ, వ్యవసాయాధికారి జానీమియా, పంచాయతీ కార్యదర్శి నవీన్, ఉప సర్పంచ్ మల్లేశ్ పాల్గొన్నారు.
తిరుమలగిరి : తిరుమలగిరి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రజినీ ప్రారంభించారు. గ్రామ సభలు నిర్వహించి పనులను గుర్తించారు. ఈ సందర్భంగా ఎంపీపీ స్నేహలత మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమంలో పనులు గుర్తించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మద్దిరాల : మండలవ్యాప్త గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సమస్యలను గుర్తించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించి గుర్తించిన పనులపై సమీక్షించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ సరోజ, సర్పంచులు, కార్యదర్శులు, టీచర్లు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
అర్వపల్లి : మండల ప్రత్యేకాధికారి, డీఏఓ రామారావునాయక్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మణ్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, సహకార సంఘం ఛైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
చివ్వెంల : పల్లె ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్ కోరారు. మండల కేంద్రంతో పాటు అక్కలదేవిగూడెంలో నిర్వహించిన పల్లె ప్రగతి ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసి గ్రామ సభలో మాట్లాడారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీఓ గోపి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జూలకంటి సుధాకర్‌రెడ్డి, కంచర్ల నిర్మలాగోవిందరెడ్డి, భిక్షంనాయక్, భద్రూనాయక్, పుట్టా గురవేందర్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ : మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ సభలు, ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మన్సూర్నాయక్, ఎంపీఓ సంజీవ, గ్రామ ప్రత్యేక అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పల్లె ప్రగతి కమిటీ సభ్యులు, కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్ అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
నాగారం : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వీధుల్లో తిరుగుతూ పల్లె ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాగారం గ్రామ సభలో ఎంపీపీ కూరం మణీవెంకన్న మాట్లాడుతూ.. పెండింగ్ పనులతో పాటు గ్రామాల్లో క్రీడా మైదానాల కోసం ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గాలి శోభారాణి, ప్రత్యేక అధికారులు, సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.