ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా అధికారులు, నాయకులు శుక్రవారం ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
మునగాల, జూన్ 3 : పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని విజయరాఘవాపురం గ్రామం లో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ఉద్యమకారుడు ఆరే సుబ్బారావును ఘనంగా సన్మానించారు.
అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర సుధారాణీపుల్లారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుంకర అజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్, పీఏసీఎస్ చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మఠంపల్లి : మండలంలోని పెదవీడు గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో ఎంపీపీ ముడావత్ పార్వతీకొండానాయక్, ప్రత్యేకాధికారి సంధ్యారాణి, ఇన్చార్జి ఎంపీడీఓ ఆంజనేయులు, సర్పంచ్ సయ్యద్ బిబికుతుబ్ పాల్గొన్నారు.
నేరేడుచర్ల / పాలకవీడు: మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లోనూ అవగాహన ర్యాలీలు తీశారు. మండలంలోని ముకుందాపురంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎంపీపీ లకుమళ్ల జ్యోతీభిక్షం ప్రారంభించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, వైస్ చైర్పర్సన్ చల్లా శ్రీలతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుతో పాటు ఆయా వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు ఘంట మల్లారెడ్డి, మాధవీసైదులు పాల్గొన్నారు. పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో సర్పంచ్ కిష్టిపాటి అంజిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె ప్రగతి ర్యాలీలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి, మండల ప్రత్యేకాధికారి శంకర్ పాల్గొనన్నారు.
చింతలపాలెం / మేళ్లచెర్వు : చింతలపాలెం మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో, వివిధ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మండల స్పెషల్ అధికారి నాగేంద్రబాబు, ఎంపీడీఓ గ్యామానాయక్, ఎంపీఓ మౌలానా, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, టీఏలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మేళ్లచెర్వు మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లోనూ గ్రామసభలు నిర్వహించారు.
గరిడేపల్లి : మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లోనూ ఆయా గ్రామాల సర్పంచులు, ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో పాదయాత్రలు చేసి సమస్యలు గుర్తించారు.
హుజూర్నగర్ : మున్సిపాల్టీ పరిధిలోని అన్ని వార్డుల అధికారులు, ఆర్పీలతో కమిషనర్ కె.శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో చేయాల్సిన పనులపై వారికి అవగాహన కల్పించారు.
కోదాడ రూరల్ / మోతె/ నడిగూడెం /చిలుకూరు / అనంతగిరి : కోదాడ మండలంలోని కూచిపూడి గ్రామంలో సర్పంచ్ శెట్టి సురేశ్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో వాడవాడ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోతె మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు పాల్గొని మాట్లాడారు. చిలుకూరు మండలంలోని గ్రామాల్లో పల్లె ప్రగతిపై గ్రామ సభలు నిర్వహించడంతో పాటు ర్యాలీలు తీశారు. అనంతగిరి మండల కేంద్రంలో ఏపీడీ పెంటయ్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
హుజూర్నగర్ రూరల్ : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు. మండలంలోని వేపలసింగారం గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించిన అనంతరం ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని సమస్యల పరిష్కారంపై ప్రణాళిక రూపొందించారు.