నల్లగొండ, జూన్ 3: రైస్ మిల్లర్లు 2020-21 సంవత్సరపు యాసంగి పెండింగ్ సీఎంఆర్ డెలివరీ జూన్ 30లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మిల్లర్లను ఆదేశించారు. ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించిన నేపథ్యంలో మరో ఆరు మిల్లులు 12వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ డెలివరీ చేయాలని పూర్తి చేయాలని సూచించారు. యాసంగి 2021 నుంచి 22లో ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందలు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ డీఎం నాగేశ్వర్ రావు, ఏఎస్ఓ నిత్యానందం పాల్గొన్నారు.అంతకు ముందు పౌర సరఫరాల అధికారులు రైస్ మిల్లర్లలతో సీఎంఆర్ లక్ష్యం మేరకు ఎఫ్సీఐకు అందజేతపై ఐడీఓసీ మీటింగ్ హాల్లో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ మాట్లాడుతూ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు పూర్తయినందన తమ వద్దన ఉన్న ధాన్యం మిల్లింగ్‌ను వేగవంతం చేయాలన్నారు. గత యాసంగి సీజన్ బియ్యాన్ని సీఎంఆర్ పూర్తికి నిర్దేశించిన గడువును ఇప్పటికే ముగిసినందున త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.