ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా పర్యావరణ సంరక్షణ, సేవాదళ్, నల్లగొండలో కేంద్రీయ విద్యాలయం, ఎన్జీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ నల్లగొండ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన వీధుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించి సైకిల్ వల్ల కలిగే అవశ్యకతను వివరించారు.నల్లగొండలో కేంద్రియ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జిల్లా యువజన క్రీడాల అధికారి మహమ్మద్ మక్బూల్ అహ్మద్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మినీమథ్యూ మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో సైక్లోథాన్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నన్నూరి రాంరెడ్డి, డాక్టర్ ఏసీహెచ్.పుల్లారావు, సురేశ్‌గుప్త, సేవదళ్ వలంటీర్లు, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు.
– రామగిరి, జూన్ 3