నల్లగొండ రూరల్, జూన్ 2 : క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని డైట్ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ్డ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి గురువారం వారు ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కాసేపు వాలీబాల్ ఆడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి. వైస్ అబ్బగోని రమేశ్‌గౌడ్ నాయకులు పిల్లి రామరాజు, అభిమన్యు శ్రీనివాస్ పాల్గొన్నారు.
కట్టంగూర్: మండలంలోని పామనుగుండ్ల గ్రా మంలో ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడానికి ప్రాంగణాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, తాసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, ఏపీఎం చౌగోని వినోద, సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి, ఎంపీటీసీ పాలడుగు హరికృష్ణ, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు షేక్ జానీపాషా, ఉప సర్పంచ్ చెరుకు నర్సింహ పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండలంలోని బైరవునిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాన్ని ఎంపీపీ గంట లక్ష్మమ్మ ప్రారంభించారు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ రేఖల లక్ష్మయ్య, సర్పంచ్ దండ రేణుకాఅశోక్రెడ్డి, ఈసీ వెంకటాచారి పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి: మండలంలోని ఎల్లారెడ్డిగూడెం, మాండ్ర గ్రామాల్లో గ్రామీణ క్రీడా మైదానాలను ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, సర్పంచులు మేడి పుష్పలతాశంకర్, దొండ సౌమ్య, రమేశ్, ఎంపీటీసీ చిరుమర్తి యాదయ్య పాల్గొన్నారు.