Narsapur Municipality | నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ అభ్యర్థి నయీమొద్దీన్ 6వ వార్డులో గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నర్సాపూర్ మున్సిపల్ 6వ వార్డులో ఏ ఇల్లు తిరిగినా ఒకటే నినాదం..మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ నయీమొద్దీన్ కే మా ఓటు అంటూ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు.
ఈ సందర్భంగా నయీమొద్దీన్ మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని.. ప్రజలు ఆదరిస్తున్నారని వెల్లడించారు. 6వ వార్డును ఎంతో అభివృద్ధి చేశానని, మరో మారు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. 6వ వార్డులో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్, 40 ఎలక్ట్రికల్ పోల్స్, ఇరిగేషన్ కాలువ, ముస్లింల స్మశాన వాటికలో ట్రాన్స్ఫార్మర్, 18 పోల్స్ తదితర అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
మరోసారి గెలిపించి నాకు అవకాశం ఇస్తే ముస్లింలకు స్మశాన వాటికకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి కృషి చేస్తానని, అలాగే మిగతా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని వెల్లడించారు. కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని నయీమొద్దీన్ కోరారు.
Cognizant jobs | కాగ్నిజెంట్లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్
Chandrahas | చంద్రహాస్ ‘గుంజి గుంజి’ పాట వివాదం .. పోలీస్ కేసు వరకు వెళ్లిన తగాదా