The Raja Saab | రెబల్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఎక్సెటెండెడ్ కట్‌తో ఓటీటీలోకి ‘ది రాజాసాబ్’
The Rajasaab OTT | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ హారర్-కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’ ఓటీటీలోకి రాబోతున్న విషయం తెలిసిందే.
The Rajasaab OTT | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ హారర్-కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’ ఓటీటీలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలైన నెల రోజుల్లోపై ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ అత్యంత భారీ ధరకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 06 నుంచి ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఓటీటీ వెర్షన్‌కి సంబంధించి గుడ్ న్యూస్ తెలిపింది చిత్రయూనిట్. ఈ సినిమా ఎక్సెటెండెడ్ కట్‌తో ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూపిస్తూ మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్)కు అమ్మానాన్న అన్నీ నాయనమ్మ గంగాదేవి(జరీనా వహాబ్)నే. గంగాదేవికి ఆల్జీమర్స్. ప్రతి విషయాన్ని మర్చిపోతుంటుంది. కాకపోతే ఎప్పుడో తనని విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త కనకరాజు (సంజయ్‌దత్)ని మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. తాత కనకారాజు కోసం వెదుకుతున్న రాజుకు కొన్ని సంచలన నిజాలు తెలుస్తాయి. నర్సాపూర్ అడవిలోని ఓ రాజమహల్ వున్నాడనే సంగతి తెలుసుకుంటాడు. ఆ రాజమహల్ అడుగుపెట్టిన రాజుకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? కనకరాజు గురించి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అసలు గంగాదేవి గతం ఏమిటి? కనకరాజు గంగాదేవిని ఎందుకు వదిలివెళ్ళిపోయాడు? తన లక్ష్యం ఏమిటి? నాయనమ్మ కోసం రాజు ఎలాంటి పోరాటం చేశాడనేది మిగతా కథ.
Due to unforeseen circumstances and last-minute technical glitches, we’ve added the extended cut! ⚠️
Regret the inconvenience caused due to hype 🙂
India’s Biggest Superstar on JioHotstar | 6th Feb 👑#TheRajaSaabOnJioHotstar #TheRajaSaab #ExtendedCut #JioHotstar pic.twitter.com/3Kq7ofY8qT
— JioHotstar Telugu (@JioHotstarTel_) February 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జాతీయ తైక్వాండో పోటీలకు కోచ్ కమ్ మేనేజర్‌గా అంబటి ప్రణీత్
ఈఎల్వీ భాస్కర్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ
Temparature | రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తగ్గుతాయన్న భారత వాతావరణ కేంద్రం..!
పదో తరగతి మండల టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోత్సాహక చెక్కులు
SP Ashok Kumar | కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి : ఎస్పీ అశోక్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

