నార్కట్‌పల్లి, మే 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రత్యేకాధికారులు, కార్యదర్శులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుధ్య పనులు, నర్సరీ నిర్వహణ, వైకుంఠధామాలు, కాంపోస్ట్ షెడ్లు నిర్వహణ, హరితహారం పనులు చేపట్టాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి వెంకయ్య, ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ సత్యనారాయణ పాల్గొన్నారు.
మర్రిగూడ : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి సూచించారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఐదో విడుత పల్లె ప్రగతిపై సోమవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి యాదయ్య, ఎంపీడీఓ రమేశ్దీన్దయాల్, ఎంపీఓ ఝాన్సీ, సర్పంచులు పాల్గొన్నారు.
చండూరు : మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఐదో విడుత పల్లె ప్రగతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కళ్యాణి, ఎంపీడీఓ జానయ్య, వైస్ ఎంపీపీ మందడి నర్సిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్, మే 30 : 5వ విడుత పల్లె ప్రగతి విజయవంతం చేయాలని నల్లగొండ మండల ప్రత్యేకాధికారి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి కోరారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లె ప్రగతి పనులను జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ సుమన్, జడ్పీటీసీ లక్ష్మయ్య, ఎంపీడీఓ వై.శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ బండ కవిత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మన్నె కృష్ణార్జున్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజుపేట మల్లేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతిపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జూన్ 3 నుంచి 18వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిపై సమీక్షా నిర్వహించాలని సూచించారు. గత పల్లె ప్రగతిలో చేసిన పనికి నిధులు మంజూరు కాలేదని పలువురు సర్పంచులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. శ్రీధర్‌రెడ్డి స్పందిస్తూ ఈవిషయాన్ని పైఅధికారులకు చేరవేస్తానని అన్నారు. సమావేశంలో ఎంపీడీఓ రేఖల లక్ష్మయ్య, తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓ సుధాకర్, సర్పంచులు పాల్గొన్నారు.
కట్టంగూర్ : ఐదో విడుత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ఎంపీడీఓ పోరెళ్ల సునీత అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య అధ్యక్షతన పల్లెప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఈదులూరు ఎంపీటీసీ తవిడబోయిన భవాని మినహా మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు బహిష్కరించారు. సమావేశంలో తాసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీఓ పర్వేజ్, ఏపీఓ కడెం రాంమోహన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.