పెద్దఅడిశర్లపల్లి, మే 30 : వచ్చే నెల 3 నుంచి జరిగే 5వ విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ మోహన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : వచ్చేనెలలో నిర్వహించే పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది, సెర్ప్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గతంలో మిగిలిన అభివృద్ధి పనులను గుర్తించి 5వ విడుతలో పూర్తి చేయాలని సూచించారు. జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, సూపరింటెండెంట్ కరుణాకర్‌రావు, పీఆర్ ఏఈ చిల్లంచర్ల ఆదినారాయణ పాల్గొన్నారు.
దేవరకొండరూరల్ : గ్రామాల అభివృద్ధే పల్లెప్రగతి లక్ష్యమని ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పల్లెప్రగతిపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఎంపీడీఓ రామకృష్ణశర్మ జూన్ 3 నుంచి 18 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా తీర్చి దిద్దాలని సూచించారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ జోక్యం చేసుకొని ప్రజాప్రతినిధులకుఏ అందుబాటులో ఉండి పనులు పూర్తి చేయాలని ట్రాన్స్‌కో ఏఈ జమీరొద్దిన్కు సూచించారు. సమావేశంలో సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
చందంపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలను భాగస్వాములను చేయాలని ఎంపీపీ నున్సావత్ పార్వతి అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో పల్లెప్రగతి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ పవిత్ర, పీఏసీఎస్ చైర్మన్ జాలె నర్సింహారెడ్డి, ఎంపీడీఓ రాములునాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.