తిరుమలగిరి/నీలగిరి, మే 30 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరి మండలంలోని గుండెపురి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులు 150 మందికిపైగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ సమక్షంలో, కనగల్ మండలంలోని పర్వతగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నకిరేకంటి శ్రీశైలం ఆధ్వర్యంలో సుమారు 20మంది నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని నమ్మి ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంక్షే మ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహలత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వందల కోట్లతో నల్లగొండ పట్టణాభివృద్ధి
ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని పేర్కొనారు. నల్లగొండ పట్టణాన్ని వందల కోట్ల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. పార్టీలో చెరిన వారిలో నర్సింగ్ శంకర్, మర్రి శంకర్, మర్రి రమేశ్, మర్రి మహేశ్, చెనగాని వెంకన్న, శివ, నకిరేకంటి వనమ్మ, లక్ష్మీనారాయణ, మర్రి గోపాల్, చొనగాని దుర్గయ్య, తిరుమల శ్రీనివాస్, బుక్క నాగరాజు ఉన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, పీఏసీఎస్ చైర్మన్ వంగాల సహదేవ్‌రెడ్డి, దోటి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్య, వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్‌రావు, గ్రామ సర్పంచ్ చెనగాని అంజమ్మారామచంద్రు, చైర్మన్ నల్లబోతు యాదగిరి, ఉప సర్పంచ్ చింత నాగమ్మాసైదులు, గ్రామ యూత్ ప్రెసిడెంట్ చెనగాని నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు కాశయ్య, లక్ష్మణ్, శంకర్ లచ్చయ్య, సైదులు, లింగస్వామి, శ్రీకాంత్, యాదగిరి పాల్గొన్నారు.