చౌటుప్పల్, మే 30 : నమస్తే తెలంగాణ సంస్థాన్ నారాయణపురం రిపోర్టర్ షేక్ పాషాకు ఉత్తమ జర్నలిస్టు అవార్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం అందించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యేటా ఇస్తున్న ఈ అవార్డును 2021-22సంవత్సరానికి గానూ పాషాకు అందించారు. ఉత్తమ మానవీయ కథనాలు రాసినందుకు గానూ షేక్ పాషా అవార్డుకు ఎంపికయ్యారు.