బీబీనగర్, మే 28 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దని జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుధాకర్‌గౌడ్ అధ్యక్షతన 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పీసీఈఓ కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ జూన్ 3 నుంచి 18వరకు 5వ విడుత పల్లె ప్రగతి నిర్వహించనున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామాల వారీగా సభలు నిర్వహించి ప్రణాళికను తయారుచేసి సమస్యలను పరిష్కరించుకోవాని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీవాణి, మండల ప్రత్యేక అధికారి అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ గణేశ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి హెచ్చరించారు. 5వ విడుత పల్లెప్రగతిపై అవగాహన సమావేశం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగింది. సమావేశా నికి మండల అధికారులు హాజరుకాకపోవడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, ట్రాక్టర్, ట్రాలీ ద్వారా చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బీరు మల్లయ్య, వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి, ఎంపీఓ అనురాధ, ఎంపీటీసీలు మల్లేశ్, కృష్ణ, కొండల్‌రెడ్డి, శారద, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
బీబీనగర్(భూదాన్‌పోచంపల్లి) : పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మండలకేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జూన్ 3 నుంచి 18 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘పల్లె ప్రగతి’ని అధికారులు విజయంవంతం చేయాలన్నారు. రోజువారీగా గ్రామాల్లో చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలశంకర్, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
వలిగొండ : ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎంపీపీ నూతి రమేశ్ అన్నా రు. శనివారం స్థానిక మం డల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులకు పల్లె ప్రగతి కార్యాచరణపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లా డారు. వచ్చే నెల 3 నుంచి 18వరకు నిర్వహించే పల్లెప్రగతిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మా అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ ఉమాబాలనర్సింహ, ప్రత్యేకాధికారి నర్సింహ, ఎంపీడీఓ గీతారెడ్డి, ఏఈ సుగుణాకర్‌రావు, ఎంపీఓ కేదారీశ్వర్, ఏపీఓలు శ్రీలక్ష్మి, జానీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
మోత్కూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జిల్లా బీసీ సంక్షేమ, మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులకు పల్లె ప్రగతి 5వ విడుత కార్యక్రమంపై అవగాహన కల్పించారు. జూన్ 3 నుంచి 18 వరకు గ్రామాల్లో నిర్వహించనున్న కార్యక్రమాలను వివరించారు.
ఎవెన్యూ ప్లాంటేషన్, పల్లెప్రకృతి వనం, ఇతర ప్లాంటెషన్లలో గతంలో నాటిన మొక్కలు చనిపోతో వాటి స్థానం లో కొత్తవి నాటాలన్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ భవనాలను, బోరు మోటర్, చేతి పంపులు, పబ్లిక్ నల్లాలు, ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. హరితహారం మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, ఎంపీఓ రావూఫ్ అలీ, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ రాంపాక నాగయ్య, పాలడుగు సర్పంచ్ యాదయ్య పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి శ్రీలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పల్లెప్రగతి నిర్వహణ సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చే నెల 3 నుంచి 18 వరకు పల్లెప్రగతి కొనసాగుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని సూచించారు. వైకుంఠధామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందించేందుకు కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ అంజిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
అడ్డగూడూరు : మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం 5వ విడుత పల్లెప్రగతి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దర్శనాల అంజయ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న శ్మశానవాటిక, కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరాముల అయోధ్య, తాసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ చంద్రమౌళి, మండల ప్రత్యేకాధికారి కృష్ణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రామన్నపేట : జూన్ 3 నుంచి నిర్వహించే ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు సమన్వయంతో పనిచేసి పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో తాసీల్దార్ ఆంజనేయులు ఎంపీడీఓ గాదె జలేందర్‌రెడ్డి, ఎంపీఓ రాజు, సర్పంచులు గుత్తా నర్సింహారెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, రేఖ యాదయ్య, ఉప్పు ప్రకాశ్, సిద్ధమ్మ, కవిత, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, పారిజాత, రమేశ్ పాల్గొన్నారు.